- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్సులు కొట్టేస్తూ పట్టుబడిన నటి.. ఇప్పటికే పబ్లిక్ ఏరియాస్‌లో అలా చేస్తూ..
by samatah |
దిశ, సినిమా : యాక్ట్రెస్ రూపా దత్త పిక్ పాకెటింగ్ కేసులో బుక్ అయింది. గతంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడనే

X
దిశ, సినిమా : యాక్ట్రెస్ రూపా దత్త పిక్ పాకెటింగ్ కేసులో బుక్ అయింది. గతంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన భామ.. కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో జేబులు కొడుతూ పట్టుబడింది. తన నుంచి రూ.65, 760 రికవరీ చేసిన పోలీసులు.. వాటి గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చిందని తెలిపారు. అయితే తనకిది ఫస్ట్ టైమ్ కాదని ఇంతకు ముందు కూడా ఇలా చేసిందని వివరించారు పోలీసులు. గతంలో చోరీలకు సంబంధించిన సంబంధించిన సమాచారాన్ని ఓ బుక్‌లో రాసుకుందని, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఆదివారం తనను కోర్టు ముందు హాజరుపరచగా.. పోలీసులు కావాలనే తనన దొంగగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. మొత్తానికి బెయిల్ రిజెక్ట్ చేసిన కోర్టు ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Next Story






