ఆగని పాక్ కవ్వింపు చర్యలు.. రజౌరీ జిల్లాలో ఏకంగా 5 పాక్ డ్రోన్లు

by Kema Shiva Kumar |

సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు.

ఆగని పాక్ కవ్వింపు చర్యలు.. రజౌరీ జిల్లాలో ఏకంగా 5 పాక్ డ్రోన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ (Pakistan) కవ్వింపు చర్యలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఈ రాత్రి పలుచోట్ల పాక్ డ్రోన్లు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఈ డ్రోన్ల కదలికలు భారత రక్షణ వర్గాలను అప్రమత్తం చేశాయి. తాజాగా, రాజౌరీ (Rajouri) జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో 5 డ్రోన్లు ఎగురుతుండటాన్ని గమనించిన బీఎస్‌ఎఫ్ (BSF) బలగాలు వెంటనే అప్రమత్తమై మీడియం, లైట్ మెషీన్ గన్లతో కాల్పులు జరిపాయి. దీంతో ఆ డ్రోన్లు వెనక్కి మళ్లిపోవడంతో, అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story