సైనిక చర్య పై ఐరాస అసహనం.. అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం

by Malleboina Mahesh |

ఖమేనీ మృతి వార్తల వేళ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఐరాస తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, ప్రపంచ శాంతికి ముప్పు అని హెచ్చరించింది.

సైనిక చర్య పై ఐరాస అసహనం.. అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై భారీ దాడికి చేసింది. యుద్ధ విమానాలతో (fighter jets) విరుచుకు పడగా.. ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఎనిమిది దేశాల్లోని అమెరికా యుద్ధ స్థావరాలపై దాడులు చేసింది. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ (America, Israel) జరిగిన క్షిపణుల ప్రయోగంలో ఇరాన్ చీఫ్ ఖమేని (Iran's Supreme Leader Khamenei)తో పాటు అయన కుమార్తె, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందల సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. ఇరు దేశాల పరస్పర దాడులతో ఆయా దేశాల్లో ఉన్న ప్రజలతో పాటు వలస కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని క్షణాలను చక్కబెట్టుకుంటున్నారు.

మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య నెలకొన్న ఈ సైనిక చర్యల పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (United Nations Security Council) అత్యవసరంగా సమావేశమైంది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సైనిక చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు అంతర్జాతీయ చట్టాలను, UN చార్టర్‌ను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఇరాక్, సౌదీ అరేబియా మొదలైనవి) జరిపిన ప్రతీకార దాడులను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ మృతి (Khamenei's death)ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్, అమెరికా వర్గాలు ఖమేనీ శరీరాన్ని వెలికి తీసినట్లు సమాచారం ఇస్తున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్క్‌లు నిలిపివేసి, గగనతలాన్ని మూసివేశారు. ఈ దాడుల వల్ల వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా, చైనా భారత్ వంటి దేశాలు కూడా ఈ ఏకపక్ష దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Next Story