మేడారంలో వన దేవతలను దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఓరం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 06:12:18  IST  )

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనం చేసుకున్నారు.

మేడారంలో వన దేవతలను దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఓరం
X

దిశ, మేడారం న్యూస్ నెట్ వర్క్: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర డోలు–డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు దర్శనం చేయించారు.

నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన కేంద్ర మంత్రులు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి , జ్యుయల్ ఓరం‌లు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, 75 కేజీల, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తులాభారం 86 కేజీల బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

Next Story