విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన: పురోగతిపై సమీక్ష

by Malleboina Mahesh |

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రమంత్రి కుమారస్వామి సమీక్ష. ప్యాకేజీ తర్వాత పురోగతి, ఆర్ కార్డులు, నిర్వాసితుల సమస్యలపై పల్లా శ్రీనివాస్ వినతి.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన: పురోగతిపై సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి (H.D. Kumaraswamy) నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శిస్తున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రే నగరానికి చేరుకున్న ఆయన,ఈ ఉదయం ప్లాంట్‌లోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించనున్నారు. అనంతరం యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమవుతారు. గత ఏడాది కేంద్రం ప్రకటించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ తర్వాత పరిశ్రమ సాధించిన పురోగతిపై ఆయన ఆరా తీయనున్నారు. ముఖ్యంగా 2026 జనవరిలో ప్లాంట్ రూ. 54 కోట్ల నగదు లాభాన్ని ఆర్జించి, మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో (94% కెపాసిటీ) పనిచేస్తుండటంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

అలాగే ప్లాంట్ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు సంబంధించిన 'ఆర్ కార్డుల' పెండింగ్ నియామకాలు, విమల విద్యాలయం మూసివేత నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించనున్నారు. వీటితో పాటు కాంట్రాక్టు కార్మికుల పునరుద్ధరణ, పెండింగ్ జీతాల చెల్లింపు వంటి అంశాలపై తక్షణమే స్పందించాలని కోరనున్నారు.

Next Story