KTR: బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర

by Gantepaka Srikanth |

సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

KTR: బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బొగ్గు స్కామ్‌(Coal Scam)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అని అన్నారు. ఈ కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి కూడా భాగస్వామ్యం ఉందని.. అందుకే చడిచప్పుడు లేకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. టెండర్ వేయాలంటే సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టారు. ఫీల్డ్ విజిట్ చేయడానికి ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే.. వారిని రేవంత్ రెడ్డి బావమరిది బెదిరిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఐదారుగురు సిండికేట్ అయినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని హరీష్ రావు బయటపెట్టారు. ఆయనే ఆయన్ను కుట్రపూరితంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి టెండర్ల కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పసలేని కేసు అని గతంలో సుప్రీంకోర్టే చెప్పింది. అయినా కూడా దానిని పట్టుకుని వేలాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Next Story