- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం రెడీ: కిషన్ రెడ్డి
సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి(Singareni) విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు పదే పదే సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోకి సీబీఐ రాకుండా నిషేధించిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిసీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అని చెప్పారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధన పెట్టడం ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. ఒక వేళ పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లు సింగరేణిలో దోపిడీ జరిగింది.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి అనేది కార్మికులు, ప్రజల ఆస్తి అని చెప్పారు. 12 ఏళ్లలో రూ.47 వేల కోట్లను కార్మికులకు ఇవ్వాల్సి ఉందని అన్నారు.






