- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబర్‌పేట్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అంబర్‌పేట్ ప్రజలే తన రాజకీయ ప్రస్థానానికి బలమని, 2004లో తెలంగాణలో బీజేపీ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసే అవకాశం కల్పించింది నియోజకవర్గమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, సికింద్రాబాద్: అంబర్‌పేట్ ప్రజలే తన రాజకీయ ప్రస్థానానికి బలమని, 2004లో తెలంగాణలో బీజేపీ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసే అవకాశం కల్పించింది నియోజకవర్గమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అంబర్‌పేట్ అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక కీలక పనులు చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోనే ఉత్తమ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేశామని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
అంబర్‌పేట్ మహంకాళి దేవాలయం సమీపంలో ఫ్లైఓవర్ కింద రహదారి నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులకు కొందరు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీసీలకు లక్ష కోట్ల నిధులు, దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు విద్యా భరోసా వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






