ఈనెల 14న కేంద్ర మంత్రి బండి కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర

by Malleboina Mahesh |

ఈనెల 14న బండి సంజయ్ 'అంజన్న ఆశీర్వాద యాత్ర'. 10 వేల మందితో కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 40 కి.మీల మహా పాదయాత్ర. మొక్కు తీర్చుకోనున్న కేంద్ర మంత్రి.

ఈనెల 14న కేంద్ర మంత్రి బండి కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 14వ తేదీన అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరిట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రజలంతా బీజేపీని ఆశీర్వదించి అత్యధికంగా స్థానాలను గెలుచుకోవడంతో ఇచ్చిన మాట ప్రకారం మొక్కులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుండి ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తారు.

పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల మొదలు, మండల, జిల్లా, పార్లమెంట్ స్థాయి నాయకులంతా రాజకీయాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పాదయాత్రలో పలు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు సైతం ఈ పాదయాత్రలో పాల్గొనే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యాయి.

Next Story