Municipal Elections: కుటుంబంతో కలిసి ఓటు వేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఓటర్లకు కీలక పిలుపు!

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది.

Municipal Elections: కుటుంబంతో కలిసి ఓటు వేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఓటర్లకు కీలక పిలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. కాగా ఈ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని జ్యోతినగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 361వ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. సాధారణ పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి కేంద్ర మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం (Polling station) వద్ద అధికారులు, భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఓటర్లకు కీలక పిలుపు

ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం అని పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంత్రి రాకతో జ్యోతినగర్ పాఠశాల పరిసరాల్లో సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు.

Next Story