జూన్ 15 నుంచి ‘స్వచ్ఛ పాఠశాల’.. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్!

by Malleboina Mahesh |

జూన్ 15న పాఠశాలల ప్రారంభం సందర్భంగా కరీంనగర్ వ్యాప్తంగా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.

జూన్ 15 నుంచి ‘స్వచ్ఛ పాఠశాల’.. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. జూన్ 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభం కాబోతున్నాయని, ఈ తరుణంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) చేర్పించి, రేపటి తరాన్ని గొప్ప విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సర్వోన్నత స్థాయికి ఎదగాలని అమ్మవారిని కోరుకున్నాను.

బాధ్యతగా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం..

కరీంనరగ్ లో పూజా కార్యక్రమం అనంతరం.. పాఠశాలల ప్రారంభాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల బాధ్యతను తాము భుజాన వేసుకుంటున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల ప్రాంగణాలను శుభ్రంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ‘స్వచ్ఛ పాఠశాల’ (Swachh Pathashala) కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సర్కారు బడులను బలోపేతం చేయడం ద్వారానే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, సమాజ హితం కోరే ఈ గొప్ప కార్యంలో ఉపాధ్యాయులు, యువత, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Next Story