వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం

by Nallavelli.Anjaneyulu |

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అరుదైన అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం పై ఎమ్మెల్యే చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం
X

దిశ, వనపర్తి : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అరుదైన అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం పై ఎమ్మెల్యే చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. గత సంవత్సరం తన జన్మదినం సందర్బంగా క్యాంపు కార్యాలయంలో సేవా దృక్పథంతో మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదాన నిధులను రికార్డు స్థాయిలో సేకరించారు. ఎమ్మెల్యే స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ మేఘా రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం నిలువలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది రోగులకు ప్రాణలను నిలిపాయి. ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేసిన కృషికి గుర్తిస్తూ గవర్నర్ చేతుల మీదుగా అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ఆహ్వానం అందడం విశేషం. భవిష్యత్తులో కూడా రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రాణాలను కాపాడే సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన, యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story