ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి : డిప్యూటీ కమిషనర్ జ్యోతి

by Batti.Sumithra |

వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మెట్టుగూడ సర్కిల్ పరిధిలో అన్ని శాఖల సమన్వయంతో (ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కన్వర్జెన్స్ మీటింగ్) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి : డిప్యూటీ కమిషనర్ జ్యోతి
X

దిశ, సికింద్రాబాద్ : వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మెట్టుగూడ సర్కిల్ పరిధిలో అన్ని శాఖల సమన్వయంతో (ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కన్వర్జెన్స్ మీటింగ్) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాన్సూన్ సీజన్‌కు సంబంధించిన కీలక అంశాల పై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డ్రైన్ల డీ-సిల్టింగ్ పనులు వేగవంతం చేయడం, చోక్ పాయింట్ల తొలగింపు, రోడ్లపై గుంతల మరమ్మత్తులు, దెబ్బతిన్న మ్యాన్‌హోల్ మూతల మార్పిడి, చెట్ల కొమ్మల కత్తిరింపు వంటి పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సర్కిల్ పరిధిలో గుర్తించిన 13 నీటి నిల్వ ప్రాంతాల పై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యాంటీ-లార్వల్ ఆపరేషన్లు, ఫాగింగ్, స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వినియోగాన్ని ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చీకటి ప్రాంతాల్లో వెలుతురు సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల పై తక్షణ చర్యలు తీసుకోవడం, ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల పై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా ఫుడ్ స్ట్రీట్ విక్రేతలు తప్పనిసరిగా డస్ట్‌బిన్లను వినియోగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. మహేందర్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎన్. సాయిబాబా, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ అనిల తదితరులు పాల్గొన్నారు.

Next Story