- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే మూలస్తంభాలు : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే నిజమైన బలమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే నిజమైన బలమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, బూత్ లెవెల్ ఏజెంట్ల విధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధుల తో ఒక ముఖ్య సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు, బీఎల్ఏ ల బాధ్యతలపై దిశా నిర్దేశం
సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యంగా మూడు అంశాలపై ప్రజా ప్రతినిధులకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామం, వార్డులో వంద శాతం సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. బూత్ స్థాయిలో బి.ఎల్.ఎ లు చురుగ్గా వ్యవహరిస్తూ, ఓటరు జాబితాల సవరణ పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించాలి. "పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభ్యర్థులు అందరూ సమిష్టిగా, సమన్వయంతో ముందుకు సాగాలి"అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
జూన్ 12న రానున్న మాజీ మంత్రి హరీశ్ రావు
ఈనెల 12న హుజూరాబాద్‌లోని ఎంపీఆర్ గార్డెన్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటరు నమోదు, బీఎల్ఏ అవగాహన సదస్సును భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీశ్ రావు హాజరుకానున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.






