- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనిషి ప్రాణం విలువ ఎంతో గొప్పది
మనిషి ప్రాణం ఎంతో విలువైందని, ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా అది ఒకరి చావుకు కారణం కాకూడదని తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు.

దిశ, సంగారెడ్డి : మనిషి ప్రాణం ఎంతో విలువైందని, ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా అది ఒకరి చావుకు కారణం కాకూడదని తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆవరణలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏడాదికి కనీసంగా దాదాపు 7500 మందికి పైగా రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రోడ్డు ప్రమాదంలో సగటున రాష్ట్రంలో రోజుకి 21 మంది మృతి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని, కారులో వెళితే కచ్చితంగా సీట్ బెల్ట్ ను ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునే వీలు ఉంటుందన్నారు. అయితే ఏదైనా రోడ్డుపై అనుకొని ప్రమాదం జరిగితే అట్టి క్షతగాత్రులను ఎవరు కూడా భయపడకుండా నేరుగా వారికి అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించాలని సూచించారు. అలా చేయడం ద్వారా వారి ప్రాణాలను నిలబెట్టిన వారు అవుతారని, దేవుడితో సమానంగా నిలుస్తారని చెప్పారు. అయితే గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చితే ఎలాంటి కేసులు ఉండవని, అలా చేసిన వారికి రవాణా శాఖ తరపున నగదు పురస్కారం కూడా అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. అందరి క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుంది : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
మనిషికి ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు టూవీలర్ పల్లె అవుతాయని, వాహనాలు నడిపించే యువకులు అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం బాధ్యతగా పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల చిరాకు వేయడం మాట అలా ఉంచితే అది మన ప్రాణాలను కాపాడే ఆయుధంగా నిలుస్తుంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.
నో హెల్మెట్ నో ఎంట్రీ
గ్రామంలో ఇకపై నుంచి హెల్మెట్ ధరిస్తేనే అనుమతించేలా 'నో హెల్మెట్ నో ఎంట్రీ' తీర్మానానికి స్థానిక సర్పంచ్ హరిప్రసాద్ పిలుపునిచ్చారు. దీనికి స్థానిక గ్రామస్తులు కూడా సభాముఖంగా మద్దతు పలికారు. ఇకపోతే రోడ్డు భద్రత విషయాలపై జిల్లా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఈడి ప్రదర్శన, కళాజాతను నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో కూడా వారి బాధలను ప్రజలకు తెలిసేలా వారి ద్వారానే వివరింపజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్ వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, డిఎంహెచ్వో లలితాదేవి, ఆర్డీవో, ఎంపీడీవో, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






