- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అన్ని శనివారాలు సెలవు
ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారి 'వర్క్ బ్యాలెన్స్' పెంపొందించే దిశగా త్రిపుర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారి 'వర్క్ బ్యాలెన్స్' పెంపొందించే దిశగా త్రిపుర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై నెలలోని అన్ని శనివారాలను అధికారికంగా సెలవు దినాలుగా ప్రకటిస్తూ అక్కడి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు త్రిపురలో సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే నెలలో కేవలం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండేది. కానీ తాజా నిర్ణయంతో, ఇకపై నెలలో వచ్చే అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలు కూడా ఉద్యోగులకు పూర్తి సెలవు దినాలుగా మారనున్నాయి. అంటే వారానికి ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. వారంలో ఒక రోజు పనిదినం తగ్గుతున్న నేపథ్యంలో, ప్రజా సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా త్రిపుర సర్కార్ ఆఫీసు పని సమయాల్లో కీలక మార్పులు చేసింది.
ఇందులో భాగంగా రోజువారీ పని వేళలను పెంచింది. ఇదివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న పని సమయాన్ని.. ఇకపై ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై అక్కడి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఇదే తరహా ఐదు రోజుల పని వారాన్ని (5-Day Week) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అమలు చేస్తే ఉద్యోగుల ఉత్పాదకత మరింత పెరుగుతుందని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు.






