- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రివ్యూవర్స్ చేసేది ప్రజా సేవ.. సామాన్యుడి జేబుకు రక్షణ కవచంలా ఉంటున్నారంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం పనిచేసేవాళ్లు కాదని, వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: ఇటీవలి కాలంలో రివ్యూవర్ల వల్లే థియేటర్లకు జనాలు రావడం లేదని, వారి వల్లే సినిమాలు దెబ్బతింటున్నాయని చాలా మంది స్టార్ నటులు, నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అంతేకాకుండా వారి వల్ల నష్టాలు వస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రివ్యూలను చూసే థియేటర్స్‌కి వెళ్లున్నారనే వాదన కూడా ఉంది. కానీ చాలామంది ఓటీటీల్లో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు రివ్యూలను నమ్మి థియేటర్స్‌కి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం పనిచేసేవాళ్లు కాదని, వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని స్పష్టం చేశారు. ఒక మూవీ చెత్తగా ఉన్నప్పుడు.. ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని, అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఒక విమర్శకుడు హెచ్చరిస్తే, అది ఒక రకమైన ప్రజాసేవ లేదా దాతృత్వంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని.. ఇలాంటి పరిస్థితుల్లో రివ్యూవర్లు సామాన్య ప్రేక్షకుడి జేబుకు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారని ఆర్జీవీ కొనియాడారు. సినిమా నచ్చకపోతే రివ్యూల వల్ల ఫ్లాప్ అయిందని అనడం కంటే, కంటెంట్‌పై దృష్టి పెట్టాలనే అర్థం వచ్చేలా వర్మ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






