- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని మహిళ మృతి
నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై సుమారు 40 ఏళ్ల వయస్సు గల ఓ మహిళ అనారోగ్యంతో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్టేషన్ మేనేజర్ గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఆమె మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఆమె కుడి చేతిపై కన్నడ భాషలో పచ్చబొట్టు (టాటూ) ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై నిజామాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం.హన్మండ్లు (ఆర్‌హెచ్‌సీ-42) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ సాయి రెడ్డిని 8712658591 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.






