- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. హెచ్చరించిన ట్రాఫిక్ పోలీసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు (Public Safety Advisory) జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు (Public Safety Advisory) జారీ చేశారు. వర్షం కారణంగా పలు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల కీలక సూచనలు..
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాలను చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి. రహదారులపై భారీగా నీరు నిలిచిన ప్రాంతాల గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించకూడదు. క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రయాణ సమయం సాధారణం కంటే ఎక్కువ పట్టే అవకాశం ఉన్నందున, దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. సోషల్ మీడియా వేదికల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అందిస్తున్న అధికారిక హెచ్చరికలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని స్పష్టం చేశారు. ప్రజల రక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






