- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనాల మహోత్సవానికి పటిష్ట భద్రత..
రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే బోనాల మహోత్సవం–2026 నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కిరణ్ ఖరే ప్రభాకర్, ఐపీఎస్ తెలిపారు.

దిశ,చంపాపేట్, జూలై 28: రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే బోనాల మహోత్సవం–2026 నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కిరణ్ ఖరే ప్రభాకర్, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు ఘటం ఊరేగింపు మార్గాన్ని మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాశీ విశ్వనాథ్ ఆలయం నుంచి లాల్‌దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం వరకు సాగే ఘటం ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన డీసీపీ, భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, వీఐపీ రాకపోకలు, బ్యారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ సౌకర్యాలు, పోలీసు బందోబస్తు, సీసీటీవీ నిఘా, అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
జాతర రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన డీసీపీ, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పాదచారులు, వాహనాల రాకపోకలను సమర్థంగా నియంత్రించాలని సూచించారు. ఆలయ నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బోనాల మహోత్సవం ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న డీసీపీ, విధుల్లో ఉన్న ప్రతి అధికారి అప్రమత్తంగా వ్యవహరించి భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో చత్రినాక డివిజన్ ఏసీపీ, చత్రినాక, మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొని, జాతర భద్రతా ఏర్పాట్లపై డీసీపీకి వివరాలు అందజేశారు. పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలతో బోనాల మహోత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశకు చేరుకున్నాయి.






