భూసేకరణ పై ఆగ్రహం..!

by Batti.Sumithra |

జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో వివిధ పరిశ్రమల కోసం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకునే ముందు వ్యవసాయ కూలీలకు చట్టబద్ధమైన పునరావాసం, పునరుద్ధరణ కల్పించకుండా భూసేకరణ చేపట్టడం తీవ్రమైన అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి. రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

భూసేకరణ పై ఆగ్రహం..!
X

దిశ, ఝరాసంగం : జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో వివిధ పరిశ్రమల కోసం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకునే ముందు వ్యవసాయ కూలీలకు చట్టబద్ధమైన పునరావాసం, పునరుద్ధరణ కల్పించకుండా భూసేకరణ చేపట్టడం తీవ్రమైన అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి. రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్గోయి గ్రామంలో రైతులు, వ్యవసాయ కూలీల సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులందరికీ ఎకరానికి 120 గజాల ఇంటి స్థలం, పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలని, ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు చట్టప్రకారం పరిహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నేతలు, రైతులు బాలయ్య, గోపాల్, ఇమన్యుయేల్, రాజు, ఖైరత్ అలీ, యూనుస్, నర్సమ్మ, భాగమ్మ, గ్రామానికి చెందిన మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Next Story