దళిత ప్రజాప్రతినిధిపై దౌర్జన్యం..!

by Kodari Anjali |

ప్రజాస్వామ్య దేవాలయం లాంటి గ్రామ సభలో దళిత ప్రజాప్రతినిధిగా తనకు ఘోర అవమానం జరిగినట్లు వార్డు సభ్యుడు సురేష్ వాపోయారు.

దళిత ప్రజాప్రతినిధిపై దౌర్జన్యం..!
X

దిశ, డోర్నకల్: ప్రజాస్వామ్య దేవాలయం లాంటి గ్రామ సభలో దళిత ప్రజాప్రతినిధిగా తనకు ఘోర అవమానం జరిగినట్లు వార్డు సభ్యుడు సురేష్ వాపోయారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో ఏడో వార్డు సభ్యుడుగా అభివృద్ధి, ప్రజా సమస్యలు, నిధులపై ప్రస్తావించినట్లు తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని సర్పంచ్ అదేగాళ్లు,బడేగాలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని,మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. తింటాం ఎంతో ఖర్చు పెట్టి గెలిచాం అడగటానికి మీరు ఎవరని దౌర్జన్యం చేసినట్లు పేర్కొన్నారు. దళిత వార్డు సభ్యుడనే కనీస గౌరవం కూడా లేకుండా నిండు సభలోనే అందరి ముందూ అవమానించారని స్థానిక ఎంపీడీవో ఆంజనేయులుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ దౌర్జన్య ఉదంతంపై సర్పంచ్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై బూరుగుపాడు సర్పంచ్ ను వివరణ కోరగా.. తమపై కావాలనే బురద జల్లుతున్నారని వాపోయారు. వార్డు మెంబర్ను అడేగాడు బడేగాడికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని తాను అనలేదని అన్నారు. దౌర్జన్యం గాని, అవమానించడం కానీ జరగలేదన్నారు. సర్పంచిగా తననే ఓ దశలో హెచ్చరించినట్లు తెలిపారు.

Next Story