Freedom Sale: ఫ్రీడమ్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

by S Gopi |

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో కొత్త పరికరాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా మారింది.

Freedom Sale: ఫ్రీడమ్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలు సిద్ధమయ్యాయి. 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్' ఆగస్టు 7న ప్రారంభం కానుండగా, 'ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్' ఆగస్టు 8న (ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే ముందస్తు ఎంట్రీతో) మొదలుకానుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఆడియో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లతో పాటు, అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో కొత్త పరికరాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా మారింది.

ఐఫోన్‌లు, ప్రీమియం ఫోన్లపై బంపర్ ఆఫర్స్

ముఖ్యంగా ఐఫోన్ 17, శాంసంగ్, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు కొనేవారికి ఈ రెండు సేల్స్ అత్యంత కీలకంగా ఉండనున్నాయి. ఇటీవల ర్యామ్, విడిభాగాల ధరలు పెరగడం వల్ల కొన్ని కంపెనీలు ఫోన్ల ధరలను పెంచినప్పటికీ, ఈ ప్లాట్‌ఫామ్‌లు అందించే బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఫ్లాష్ సేల్స్ వల్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఒకే సమయంలో రెండు ప్లాట్‌ఫామ్‌లు సేల్స్ ద్వారా పోటీపడుతుండటంతో, ఆర్డర్ ఇచ్చే ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ధరలను పోల్చి చూసుకోవడం కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనాలను అందించనుంది.

Next Story