- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్వాల్‌లో వివాహిత అదృశ్యం..
ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ మహిళ ఆదృశ్యం అయిన సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, అల్వాల్: ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ మహిళ ఆదృశ్యం అయిన సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోతుకుంట ఇందిరానగర్ కాలనీకి చెందిన బి. వెంకటేశ్వర్లు, శ్యామల(25) భార్య భర్తలు ఈ నెల 5వ తేదిన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటినుంచి ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన మొబైల్ ఫోన్ ను ఉంచి, దుస్తులు ఆమె వ్యక్తిగత వస్తువులను వెంట తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇంతకాలం కుంటుంబ సభ్యులు, బంధువులు స్నేహితుల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. శ్యామల ఇదే తరహాలో గతంలో ఇంటి నుంచి వెళ్లి పోగా, అప్పట్లో కర్నూల్ జిల్లా నంద్యాల పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఆదృశ్యమైన శ్యామల ఆచూకీ తెలిసిన వారు అల్వాల్ పోలీస్ స్టేషన్ లేదా ఎస్ ఐ దేవేందర్ కు ఫోన్ చేయాలని పోలీసులు పేర్కొన్నారు. ( 8712663259)






