- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో ప్రభావం.. ఆల్మట్టి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి జూపల్లి
రాష్ట్రానికి ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, బీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, బీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ కు ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి కొరత వచ్చే పరిస్థితి ఉందని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా జలాశయాల్లో నిల్వ చేయడంతో పాటు చెరువులు, కుంటలను నింపే కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వరద ప్రవాహాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చడంతో పాటు రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.






