- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా నాటు సారా దాడులు
నల్గొండ జిల్లా డీపీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు తండాల్లో పోలీసులు సంయుక్తంగా నాటు సారా నిరోధక దాడులు నిర్వహించారు.

దిశ, దేవరకొండ టౌన్ : నల్గొండ జిల్లా డీపీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు తండాల్లో పోలీసులు సంయుక్తంగా నాటు సారా నిరోధక దాడులు నిర్వహించారు. దేవరకొండ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో నల్గొండ, నాంపల్లి ఎస్‌హెచ్‌ఓలు తమ సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, దేవరకొండ పరిధిలోని మేగ్యా తండా, పన్నీ తండా, అమ్గోత్ తండా, కేశ్యా తండా, మర్రిచెట్టు తండాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
దాడుల సందర్భంగా సారా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 600 లీటర్ల బెల్లం పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 180 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల పటిక, తయారు చేసిన 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మరో ముగ్గురు వ్యక్తులను బైండ్ ఓవర్ చేసినట్లు దేవరకొండ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






