- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంఘ నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు
మండల పరిధిలోని నార్మమ్మగూడెం గ్రామంలోని సంఘ బంధం–2 నిధుల దుర్వినియోగంపై జరిగిన శాఖాపరమైన విచారణ పూర్తయింది.

దిశ, నిడమనూరు : మండల పరిధిలోని నార్మమ్మగూడెం గ్రామంలోని సంఘ బంధం–2 నిధుల దుర్వినియోగంపై జరిగిన శాఖాపరమైన విచారణ పూర్తయింది. విచారణలో సంఘ సహాయకురాలు (వీవోఏ) మందడి రజిత నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. బాధిత సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఫిబ్రవరిలో సంఘ తీర్మానం లేకుండానే ఫోర్జరీ చేసి నిధులు దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం నిర్వహించిన శాఖాపరమైన విచారణలో సంఘ తీర్మానం లేకుండా నగదు డ్రా చేసి దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంఘ సభ్యులు పోకల పద్మ, పీర్ల దుర్గమ్మ, నాగనబోయిన మంగలు ఆరోపించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంఘ సహాయకురాలు మందడి రజితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.






