ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

by Taduka Kalyani |

ఇంట్లో ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
X

దిశ, రామగిరి: ఇంట్లో ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని బుడగ జంగం కాలనీకి చెందిన బోడకుర్తి సుజాత(22) అనే యువతి తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఎంసీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న రామగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story