గొర్రెల మంద పై కుక్కల దాడి.. నాలుగు జీవాలు మృతి

by Batti.Sumithra |

మంచాల మండల పరిధిలోని తాళ్లపల్లిగూడ గ్రామంలో ఊరుకుక్కల దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.

గొర్రెల మంద పై కుక్కల దాడి.. నాలుగు జీవాలు మృతి
X

దిశ, మంచాల : మంచాల మండల పరిధిలోని తాళ్లపల్లిగూడ గ్రామంలో ఊరుకుక్కల దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుంతకండ్ల గణేష్ యాదవ్ అనే రైతు తన గొర్రెల మందను ఆవరణలో ఉంచగా, రాత్రి వేళ ఒక్కసారిగా వీధి కుక్కలు మంద పై పడి దాడి చేశాయి. ఈ దాడిలో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలు జీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. కుక్కల దాడితో తనకు రూ.వేలల్లో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు. గ్రామంలో రోజురోజుకూ వీధి కుక్కల బెడద పెరుగుతోందని, రాత్రి వేళల్లో బయటకు రావాలన్నా, జీవాలను కాపాడుకోవాలన్నా భయపడాల్సి వస్తోందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఊరుకుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు నవీన్ గౌడ్, సుధాకర్, జంగయ్య పాల్గొన్నారు.

Next Story