- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విహారయాత్రలో విషాదం.. చింతూరు ఏజెన్సీలో ఇద్దరు గల్లంతు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా విహారయాత్రకు వచ్చిన పర్యాటకుల్లో ఇద్దరు యువకులు వాగులో ఈతకు దిగి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. బాధితుల వివరాల్లోకి వెళితే, గల్లంతైన యువకులు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన పెండెం కల్యాణ్, పెండెం బాబీలుగా పోలీసులు గుర్తించారు. వీరు తమ మిత్రులతో కలిసి ఏజెన్సీ అందాలను తిలకించేందుకు విహారయాత్రకు వచ్చి, సరదాగా వాగులో ఈత కొడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన యువకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో వారి స్వగ్రామం వీరంపాలెంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.






