నేరేడ్మెట్‌లో బీఆర్ఎస్ బలోపేతం.. పలువురు యువకులు పార్టీలో చేరిక

by Kodari Anjali |

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో నేరేడ్మెట్ డివిజన్ ఆర్కే పురానికి చెందిన ఆకాష్, కిరణ్ కుమార్, అనిల్‌తో పాటు పలువురు బస్తీవాసులు మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.

నేరేడ్మెట్‌లో బీఆర్ఎస్ బలోపేతం.. పలువురు యువకులు పార్టీలో చేరిక
X

దిశ, మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో నేరేడ్మెట్ డివిజన్ ఆర్కే పురానికి చెందిన ఆకాష్, కిరణ్ కుమార్, అనిల్‌తో పాటు పలువురు బస్తీవాసులు మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సుమన్ గౌడ్, విజయరెడ్డి, ఆర్కే పురం బస్తీవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story