- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల దాడిలో ఐదుగురు జూదరుల అరెస్ట్....
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

దిశ, సుల్తానాబాద్: విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కొందరు వ్యక్తులు డబ్బులతో మూడు ముక్కలాట (టీన్‌పత్తి) ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సుల్తానాబాద్ ఎస్‌ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పూసల గ్రామానికి చెందిన నిమ్మల అనిల్, చొప్పరి రాకేష్, చొప్పరి రాజు, కొమ్ము శ్రీకాంత్, పూసల సాంబమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.25,020 నగదు, 52 పేకముక్కలు, ఐదు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిపై తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.






