- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల తనిఖీలు
నగరంలో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, విజ్ఞప్తి చేశారు.

దిశ, కార్వాన్ : నగరంలో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయిన ప్రాంతాలను, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో జాయింట్ సీపీతో పాటు డీసీపీలు అవినాష్ కుమార్,ట్రాఫిక్- 1, కాజల్ సింగ్ ట్రాఫిక్-2, రాహుల్ హెగ్డే ట్రాఫిక్-3, పాల్గొని లకిడికాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్‌లోని పీటీఐ వంటి ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించడంతో, ట్రాఫిక్ పోలీసులు సిబ్బందితో కలిసి రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. వర్ష తీవ్రత దృష్ట్యా అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. ప్రయాణికులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని, విధుల్లో ఉన్న పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. అదనపు సమయం కేటాయించాలి: అత్యవసరంగా బయటకు వెళ్లేవారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ సమయం కంటే కాస్త ముందే బయలుదేరాలి. అధికారిక సమాచారమే ప్రామాణికం: సామాజిక మాధ్యమాలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇచ్చే అధికారిక ట్రాఫిక్ అప్‌డేట్‌లను గమనిస్తూ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.






