వనస్థలిపురంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

వనస్థలిపురంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, హస్తినాపురం: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఏఆర్టీ థియేటర్ ఎదురుగా, ఎస్‌ఎస్‌వీ వీల్ కేర్ షెల్టర్ పక్కన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండగా, 5.5 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు, తెల్లటి గడ్డం కలిగి ఉన్నాడు. మృతుడి తల వెనుక భాగంలో రక్తస్రావంతో కూడిన గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8712662280, 8712662300, 8712662637.

Next Story