- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పాపం ప్రతాప్'లో హీరోకు మొదట ఆ సమస్యే.. ఆ సినిమా టీజర్ చూసి వెంటనే మార్చేశాం
'పాపం ప్రతాప్'లో మొదట హీరోకు గురక సమస్యను ప్రధాన అంశంగా అనుకున్నట్లు తిరువీర్ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు తిరువీర్ తాజాగా 'ఓ..! సుకుమారి' చిత్రంలో హీరోగా నటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించింది. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తిరువీర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన గత చిత్రం 'పాపం ప్రతాప్' గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తిరువీర్ మాట్లాడుతూ.. మొదట 'పాపం ప్రతాప్' కథను అనుకున్నప్పుడు హీరోకు గురక పెట్టే సమస్య ప్రధాన అంశంగా ఉండేది. అయితే అదే సమయంలో తమిళ చిత్రం 'గుడ్ నైట్' టీజర్ చూశాం.
అందులో కూడా హీరోకు ఇదే సమస్య ప్రధానంగా ఉండటంతో వెంటనే మా దర్శకుడు ఆ అంశాన్ని తొలగించి మరో సమస్యను కథలో చేర్చారు. అలా సినిమాలో హీరోకు ప్రధానంగా ఉండే సమస్య పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇక 'పాపం ప్రతాప్' విడుదలకు ముందు ఈ సినిమాపై తిరువీర్ చాలా నమ్మకంగా ఉన్నప్పటికీ, విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. అయితే ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న 'ఓ..! సుకుమారి' ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






