- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలులో కారు బీభత్సం.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ స్పాట్ లో మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ స్పాట్ లో మరణించారు. అతివేగంగా వచ్చిన AP 40DB0189 రిజిస్ట్రేషన్ నంబరు గల కారు అతివేగంగా దూసుకొచ్చి చెత్త సేకరించే వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం అదుపుతప్పి.. సైకిల్ పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్, మరో టూ వీలర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మరియదాస్ ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. కాగా.. ప్రమాదసమయంలో కారును ఓ వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందడంపై హోంమంత్రి అనిత సంతాపం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రమాదంలో గాయపడినవారిని మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.






