- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్లు పారియమంటే రక్తం పారిస్తామంటారా?.. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోతామనే భయంతోనే సీఎం బూతులు మాట్లాడుతున్నారని, తన ఈగో వల్లే రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిలో అధికారం కోల్పోబోతున్నామనే ఫ్రస్టేషన్ కనిపిస్తోందని అందుకే ప్రతిపక్షాల రక్తం పారించాలంటూ హింసను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారని, హిట్లర్ తనకు ఆదర్శమని ఇప్పటికే చెప్పుకున్న రేవంత్ రెడ్డి వద్ద చెప్పడానికి విషయం లేకనే బూతులకు దిగుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిలో శాటిస్ట్, బూతులు, అబద్ధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని షాబాద్‍లో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్‍కు, సీఎంకు మధ్య తేడా లేదన్నారు. పొలాల్లో నీళ్లు పాలించమంటే బూతులు పారిస్తున్నారని మా రక్తం కావాలంటే తీసుకో కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. కన్నెపల్లి మోటార్లు నొక్కమంటే ప్రతిపక్షాల గొంతు నొక్కుతామంటున్నారని మా రక్తం పారితేనే రైతులకు నీళ్లు ఇస్తామంటే రైతుల కోసం మా రక్తం ఇచ్చేందుకు కూడా సిద్ధమే అన్నారు. షాబాద్ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఘటనపై స్పందించలేదన్నారు.
వాస్తవాలు మాట్లాడితే జైల్లో పెడతానంటావా?:
మొన్న కన్నెపల్లి వద్ద నీళ్లే లేవని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పే వరకు నీళ్లు ఎత్తిపోయమని కొత్త రాగం అందుకున్నారని ఆరోపించారు. 31 నెలలు సీఎంగా ఉన్నా రేవంత్‍కు విషయాలు అర్థం కావడం లేదన్నారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు స్పష్టంగా చెప్పారు. రూ. ఎనిమిదిన్నర కోట్ల ఖర్చుతో చిన్న కాపర్ డ్యామ్ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని ప్రభుత్వానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా లేఖ రాశారు. ఆ లేఖ బయటపెట్టాలన్నారు. రిటైర్ట్ ఇంజినీర్లను జైల్లో పెడతానంటావ్, ప్రశ్నించిన ప్రస్తుత ఇంజినీర్లపై ఏసీబీలతో దాడులు చేయిస్తున్నారు. ప్రతిపక్షాలను రక్షం పారిస్తానంటున్నారు. ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుందా అని ప్రశ్నించారు. కన్నెపల్లి, దేవాదుల, సీతారామా ప్రాజెక్టుల్లో నుంచి ఎత్తిపోస్తే పట్టిసీమకు నీళ్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. దేవాదులలో 10 మోటర్లు ఉంటే నాలుగు మాత్రమే ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. ఇక్కడ పండబెట్టి ఎన్డీఎస్ఏ అని డ్రామాలు ఆడుతున్నారు. దేవాదులలో ఏ ఎన్డీఎస్ఏ అడ్డం వచ్చిందని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నావా? గాడిద పళ్లు తోముతున్నావా? లేక పందులుకాస్తున్నావా అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. నీకే కాదు నాకూ మాట్లాడవచ్చు. కానీ సంస్కారం అడ్డువస్తుందన్నారు.
చూస్తూ ఊరుకునేది లేదు:
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీళ్లు ఎత్తిపోయాలని ఇంత మంది చెబుతున్నా నీళ్లు ఎత్తిపోస్తే ఇంత కాలం బీఆర్ఎస్‍పై తాము చేసిన ప్రచారం అవాస్తవం అని ప్రజలకు అర్థం అవుతుందనే కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన ఈగో వల్లే నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. 20 ఏళ్లుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నడుస్తోందని రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారని ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంత మాత్రాన ఏది మాట్లాడితే నడువదన్నారు. బీఆర్ఎస్ హాయంలోనే ఎల్లంపల్లి పూర్తయిందన్నారు. ప్రజలు అన్ని గమిస్తున్నారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద హైదరాబాద్ సహా అనేక జిల్లాలతో పాటు ఎల్లంపల్లి మీద ఆధారపడి రామగుండం థర్మల్, ఎన్డీపీసీ, సింగరేణికి ఈ ప్రాజెక్టు నుంచే నీళ్లు కావాల్సి ఉందన్నారు. నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
భద్రాచలంకు ముప్పులేదు:
అన్నారం, సుందిళ్ల గేట్లు మూసేస్తే భద్రాచలం కొట్టుకుపోతదని సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కానీ 2022 లో 28లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు వచ్చింది. గతేడాది 15 లక్షల క్యూసెక్కుల మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అయినా భద్రాచలంకు, ఆ 40 గ్రామాలకు ఏమి జరగలేదు. అన్నారం, సుందిళ్ళ రెండింటిలో కలిపి నింపేది 10 టీఎంసీలేనని ఇవి రెండు కలిపి ఒకేసారి కిందకు వెళ్లినా ఏమి జరగదన్నారు. దేవాదుల వద్ద పూర్తి స్థాయిలో మోటార్లు ఎందుకు నడవడం లేదు అని మండిపడ్డారు.






