- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల రాజేందర్ అందుకే అలా మాట్లాడారేమో.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఈటల రాజేందర్‌ను తాను కలవక మాట్లాడక చాలా ఏళ్లు అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహనతోనే ఈటల మాట్లాడి ఉంటారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి, ఆ జిల్లా మంత్రిగా పనిచేశారు కాబట్టి మాట్లాడారేమోనని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈటల రాజేందర్‌ను తాను కలవక మాట్లాడక చాలా ఏళ్లు అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహనతోనే ఈటల మాట్లాడి ఉంటారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి, ఆ జిల్లా మంత్రిగా పనిచేశారు కాబట్టి మాట్లాడారేమోనని అన్నారు. ప్రాజెక్టు గురించి మాట్లాడినంత మాత్రాన ఆయనతో నాకేం సంబంధం అని వ్యాఖ్యానించారు. ఆయన వేరే పార్టీ..నేను వేరే పార్టీలో ఉన్నానని అన్నారు. తాను చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే రకం కాదని చెప్పారు. చచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని అన్నారు. ఇదే విషయం 100 సార్లు చెప్పానని వ్యాఖ్యానించారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని స్వయంగా ప్రధానమంత్రే చెప్పారని అన్నారు.
ఫైనాన్స్ బిల్లులో 12శాతం తీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం దీనిపై ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరపున పోరాటం మరింత ఉదృతం చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కరువు వచ్చే అవకాశం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టును నింపాలని అన్నారు. ప్రాజెక్టులో ఒక బ్యారేజీ కాస్త డ్యామేజ్ అయితే ప్రాజెక్టు మొత్తం పాడైపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోయాని చెప్పారు. మిషన్ భగీరథతోనూ ఇంటింటికీ మంచినీళ్లు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నుండి విమర్శలు వస్తున్నాయి.






