- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాసిరకం మాంసంపై మున్సిపాలిటీ కొరడా.. 20 కిలోల మాంసం స్వాధీనం, రూ. లక్ష జరిమానా
జనగామ పట్టణంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

దిశ,జనగామ: జనగామ పట్టణంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 కిలోల నాసిరకం, అపరిశుభ్ర మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన ఓ వ్యాపారి పై రూ.1లక్ష జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన, నిబంధనలకు అనుగుణమైన స్లాటర్ హౌస్‌లలోనే జంతువులను వధించి, పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు విక్రయించాలని అన్ని మాంసం వ్యాపారులకు ఆయన సూచించారు.
అక్రమ వధలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మాంసం విక్రయం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణే జనగామ మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.






