- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపోహలు వద్దు.. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
అల్బెండజోల్ మాత్రల వల్ల ఎటువంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్ కోరారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అల్బెండజోల్ మాత్రల వల్ల ఎటువంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్ కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జూలై 13న అల్బెండజోల్ మందుల పంపిణీ వైద్య శాఖ సర్వం సిద్దంగా ఉందన్నారు. జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు గల 2,12,569 అర్హులైన పిల్లలందరికీ 2461 పంపిణీ కేంద్రాల మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టల్స్, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల లో ఆరోగ్య సిబ్బంది ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 13 జులై రోజున మాత్రాలు తీసుకోలేని పిల్లలకు మళ్లీ జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా మాత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అర్హులైన ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, బలహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. నులిపురుగుల నివారణకు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం, పరిశుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వినియోగించడం, పాదరక్షలు ధరించడం, బహిరంగ మల విసర్జనకు బదులుగా మరుగుదొడ్ల ను వినియోగించడం వంటి పరిశుభ్రత చర్యలు పాటించాలని సూచించారు.






