- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడని చెరువుకు చెర….కుమ్మరి కుంట చెరువు కబ్జా, ప్రహరీ నిర్మాణం
వందల ఏళ్ళుగా పంటల సాగుకు ఆధారంగా ఉన్న చెరువులకు రక్షణ కరువైంది. కొందరు అక్రమార్కులు చెరువు శిఖం భూముల్లో సాగు చేస్తుండగా, మరికొందరు నిర్మాణాలు చేపడుతూ వాటిని ఆక్రమించుకుంటున్నారు.

దిశ, కల్వకుర్తి : వందల ఏళ్ళుగా పంటల సాగుకు ఆధారంగా ఉన్న చెరువులకు రక్షణ కరువైంది. కొందరు అక్రమార్కులు చెరువు శిఖం భూముల్లో సాగు చేస్తుండగా, మరికొందరు నిర్మాణాలు చేపడుతూ వాటిని ఆక్రమించుకుంటున్నారు. గతంలో కొన్నెండ్లుగా వందల ఎకరాలకు ఆయువు పట్టుగా ఉన్నా చెరువు ను ఓ బడా వ్యాపారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. అత్యంత విలువైన సర్కారు చెరువు శిఖం కబ్జా అన్యాక్రాంతమైన అధికారుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ చెరువు కబ్జా తతంగం ఎక్కడో కాదు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటిలో జరిగింది. మున్సిపాలిటి పరిధిలోని నాగర్ కర్నూల్ రోడ్డులో గల కుమ్మరి కుంట చెరువు శిఖం 54.19 గుంటలు అత్యంత విలువైనది. ఈ విలువైన చెరువు భూమిని నాలుగేళ్ల క్రితం కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్త, మిల్లు యజమాని(సెట్ సాబ్) కొంత మేర ఆక్రమించుకొని 10 అడుగులపెద్ద ప్రహరీనే నిర్మించారు. సరిహద్దులు మరియు ఎఫ్‌టీఎల్ పరిధి దాటి తన అధీనంలోకి తీసుకున్నాడు. జలవనరులను కబ్జా చేయడం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తీవ్రమైన నేరమని తెలిసిన ఆక్రమణకు పాల్పడ్డాడు.
అధికారులు గోడ కుల్చారు... సేటు గోడ పునర్నిర్మాణం..
గత మూడేండ్ల క్రిందట " దిశ " పేపర్ లో వచ్చిన వరుస కథనాలతో అప్పటి తహసిల్దార్ రాంరెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు చెరువు పరిశీలించి కబ్జాకు గురైందని గమనించి మిల్లు యజమాని ఐనా " సేట్ సాబ్ " కు నోటిసులు అందజేసి ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. కాలక్రమేనా తహసిల్దార్ బదిలి ఐనా 3 మాసాలకే మరల ప్రహారిని నిర్మాణం చేసి సంభందిత శాఖ అధికారులకు సవాల్ విసిరాడు.
దిశ పత్రికలో వరుసగా 9 కథనాలు..
2023 జనవరి 06న కబ్జా కోరల్లో కుమ్మరి చెరువు", 2023 ఫిబ్రవరి 7న " కుమ్మరి`కుంట చెరువు కబ్జా ", 2024 మార్చ్ 13 న " కుమ్మరి చెరువు కబ్జా వీడదా" , జూలై 25న " ప్రభుత్వ చెరువు కబ్జా", 2025 ఆగష్టు 24 న " కుమ్మరి కుంట చెరువు కబ్జాయే" , అక్టోబర్ 25న " కబ్జా కళ్లెదుటే...చర్యలు తీసుకురేం", నవంబర్ 7న"అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట", తహసిల్దార్ బదిలివ్వడంతో మిల్లు యజమాని మరల ప్రహారీ గోడను నిర్మించారు. అనంతరం దిశ పేపర్ ప్రతినిధి కి ఈ సమాచారం రావడంతో సంభందిత శాఖల అధికారులకు ఈ విషయమై పలుమార్లు విన్నపించి, కథనాలు రాయడం జరిగింది.
బాద్యతేవరిది....?
కుంటలు, చెరువుల రక్షణ బాద్యత రెవిన్యూ, నీటి పారుదల శాఖలదే. తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలకు సంబంధించిన అధికారిక సమాచారం, యాజమాన్య హక్కులు మరియు ఇతర వివరాలను పరిశీలించడానికి రెవెన్యూ శాఖ మరియు నీటిపారుదల శాఖలు ప్రధాన బాధ్యత వహిస్తాయి. చెరువులు, కుంటలు, వాటికి సంబంధించిన శిఖం భూములు, నీటి వనరుల మ్యాపింగ్ వివరాలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. పట్టణ పరిధిలో ఉండటం వల్ల దీని పరిరక్షణ బాధ్యత కల్వకుర్తి మున్సిపాలిటీ , స్థానిక రెవెన్యూ, నీటిపారుదల శాఖ లపై ఉమ్మడిగా ఉన్నా చర్యలు మాత్రం శూన్యం.
ఏండ్లు గడుస్తున్నా....
ఏండ్లు గడుస్తున్నా మిల్లు యజామానిపై చర్యలు తీసుకోని చెరువును కాపాడటంలో సంభందిత శాఖల అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నరనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కబ్జా చేస్తుంటే కాపాడే బాధ్యత మాకు లేదనే కోణంలో అధికారులున్నారని తెలుస్తుంది. పలుమార్లు నోటిసిలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. చిన్న, చితక వారిపై జులుం చూపించే ఈ అధికారులు ప్రభుత్వ చెరువును కబ్జా చేస్తే ఎందుకు చర్యలు తిసుకోవడం లేదనే ఆరోపణలు కల్వకుర్తి పట్టణ ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. చిన్న వ్యాపారైనా, బడ వ్యాపారియైన చట్టం ముందు అందరు సమానులే అని తెలిసి కూడ నిమ్మకు నిరేత్తకుండా వ్యవహరించడంలో పరమార్థం ఏంటనే ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి.
పర్యవేక్షించేవారే కరువయ్యారు....
గతంలో చెరువులకు నీటి విడుదల, చేపల పెంపకం, మట్టి తరలింపు, శిఖం ముంపు తదితర అంశాలను సాగునీటి సంఘాలు పర్యవేక్షించేవారు. ఐదేళ్ళుగా సాగునీటి సంఘాలకు ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో చెరువుల వైపు చూసేవారు లేకుండపోయారు. వీఆర్వో లు ఉన్న సమయంలో కొంత మేరకు ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. ఆ వ్యవస్థా కూడా రద్దు చేయడంతో నీటి వనరుల భూముల పరిరక్షణకు ఎవరు లేకుండా పోవడంతో చెరువులు అన్యక్రంతామవుతున్నాయి.
నిర్లక్ష్యం వీడాలి.....
కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటల శిఖం భూములు వాస్తవంగా ఎంతుందో గుర్తించి, సర్వే చేసి హద్దులు నాటించాలి.రికార్డుల పరంగా రెవిన్యూ,ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చర్యలను ఉపక్రమించాలి. కాని వీటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంలేదనే అపవాదు మోస్తున్నారు. జిల్లా యంత్రాంగం చెరువులు కబ్జాకబందుల హస్తాల్లో చిక్కు కోకుండా కాపాడగలిగితేనే గ్రామాలకు, పట్టణాలకు భద్రత కలుగుతోంది.మంచినీటి, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయి. భూగర్భజలాలు అడుగంటి పోతాయి. మూగజీవాలకు పశుపక్ష్యాదులకు తాగు నీరు దొరకని దుస్థితి దాపురిస్తోంది. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు మేన వేషాలు లెక్కించకుండా కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న చెరువు శిఖాన్నిస్వాధీన పరచుకొని, నిర్మాణం జరిగిన ప్రహారి గోడ తొలగించి పరిశ్రమ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






