ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ భారత్

by Batti.Sumithra |

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆర్మూర్ ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ భారత్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్ డిపో ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా 62వ ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు.

ప్రతి నిత్యం ఎంతో మందిని తమ గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే మా సంస్థ లక్ష్యమని ఇందుకోసం ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సావిత్రి, డిపో గ్యారేజ్ ఇన్చార్జి జెస్సు విజేంధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగొడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, జంగిడి భోజన్న, జహీర్, రాహుల్రాజ్, శ్యాంసుంధర్, శేఖర్, కృషివర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story