కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

by Ratna Kumari |

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
X

దిశ, హన్వాడ : రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హన్వాడ మండలంలోని వేపూర్, మహబూబ్‌నగర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన సుమారు వెయ్యి మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నర ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో వేపూర్ గ్రామ సర్పంచ్ నాయికోటి చెన్నయ్య, ఫత్తేపూర్ గ్రామ సర్పంచ్ పి.అశోక్ యాదవ్‌తో పాటు వార్డు సభ్యులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మహబూబ్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పీ. వెంకటేష్, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story