- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యేపై ఎంపీ అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్
కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు అంశంలో ఎట్టకేలకు ముందు అడుగు పడింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి: కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు అంశంలో ఎట్టకేలకు ముందు అడుగు పడింది. బిజెపి నాయకులు ముందు నుండి పట్టుబడుతున్న చల్ గల్ వాలంటరీ కేంద్రంలోనే ఐదు ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించగా ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అరవింద్ లు కేవి శాశ్వత భవనానికి భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్‌ను అమ్ముకుంటున్నాడని ఆరోపించిన ఆయన, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌వి "చిల్లర రాజకీయాలు" అంటూ మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయానికి ఐదు ఎకరాలు సరిపోవని, వెంటనే అదనంగా మరో ఐదు ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమి బీజేపీ పోరాట ఫలితమేనని పేర్కొంటూ, మరో ఐదు ఎకరాలు కేటాయించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలేడని తెలంగాణలోనే వరస్ట్ ఎమ్మెల్యే సంజయ్ అంటూ విమర్శించారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం చేయడం తప్పిదమని, ఆయన ఆశీస్సులు కాంగ్రెస్‌కు అవసరమని వ్యాఖ్యానించారు. విద్యాశాఖ, పరిపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరైన అవగాహన లేదని ఆరోపించిన ఎంపీ అరవింద్, పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.






