రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి..

by Batti.Sumithra |

గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం చోటుచేసుకుంది.

రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు(ఎం) మండలం సారగండ్లగూడెంకు చెందిన నవీన్ (35) శుక్రవారం తన భార్య, పిల్లలను సొంత ఊరికి పంపించి, తాను వరంగల్‌లో పని ఉండడంతో "భువనగిరి నుంచి డైరెక్ట్‌గా ఊరికి వస్తాను" అని చెప్పి వరంగల్ వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని శనివారం సాయంత్రం 6 గంటలకు తన భార్యకు ఫోన్ చేసి, "నేను కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నాను. రైలులో తిరిగి వస్తున్నాను" అని తెలిపాడు. ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ముందు గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ప్రమాదవశాత్తు కిలోమీటర్ 240/37-35 వద్ద, యాదాద్రి రైల్వే స్టేషన్, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడికి భార్య మనీషా, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు.

Next Story