క్యాతంపల్లిలో జోరుగా అక్రమ మట్టి రవాణా?

by Ratna Kumari |

ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లి గ్రామంలో అక్రమ మట్టి రవాణా జరుగుతోందంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

క్యాతంపల్లిలో జోరుగా అక్రమ మట్టి రవాణా?
X

దిశ, ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లి గ్రామంలో అక్రమ మట్టి రవాణా జరుగుతోందంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా దేవాదుల కెనాల్‌కు చెందిన మట్టిని తరలిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రైతుల ఆరోపణల ప్రకారం, దేవాదుల కాలువ నుంచి మట్టిని తరలిస్తూ సంబంధిత భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, కాలువకు సంబంధించిన భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించారు. గ్రామంలో జరుగుతున్నట్లు చెబుతున్న ఈ అక్రమ మట్టి రవాణాపై దేవాదుల అధికారులు, మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, స్థానిక పోలీసులు స్పందించి విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Next Story