- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారు బిడ్డకు బాలు నాయక్ అభినందనల జల్లు..!
డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన నారిమల్ల ప్రవళిక ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభినందనలు తెలిపారు.

దిశ, డిండి (గుండ్లపల్లి) : చైనాలోని ఓర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్–2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు స్వర్ణ పతకం అందించిన డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన నారిమల్ల ప్రవళికకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థిని అయిన ప్రవళిక అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే కాకుండా, దేవరకొండ నియోజకవర్గ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిందని ఎమ్మెల్యే కొనియాడారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన గ్రామీణ యువతి నారిమల్ల ప్రవళిక కఠిన శ్రమ, పట్టుదలతో ఆసియా స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. "మన దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఒక ఆడబిడ్డ అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి బంగారు పతకం సాధించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం. డిండి మైదానంలో సాధన చేసి, చైనా వేదికపై స్వర్ణ పతకం గెలవడం రాష్ట్రంలోని వేలాది మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం" అని బాలు నాయక్ అన్నారు. ప్రవళికను అంతర్జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన కోచ్ పస్పుల పరుశురాముడు, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీ యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.






