- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూర్ఛ రావడంతో కుంటలో పడి వ్యక్తి మృతి
by Ratna Kumari |
మండలంలోని చిన్నవంగర గ్రామంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లిన వ్యక్తి మూర్ఛ రావడంతో నీటిలో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, పెద్దవంగర : మండలంలోని చిన్నవంగర గ్రామంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లిన వ్యక్తి మూర్ఛ (ఫిట్స్) రావడంతో నీటిలో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నవంగర గ్రామానికి చెందిన జలగం సురేష్ (44) శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని కుంట వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాడు. ఈ సమయంలో అతనికి అకస్మాత్తుగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో కుంటలో పడిపోయి మృతి చెందాడు. మృతుడి తండ్రి అప్పయ్య, సోదరుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
Next Story






