'గూడెం' లో జనసేన జోష్.. భారీ బైక్ ర్యాలీ, చేరికలు

by Kodari Anjali |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది.

గూడెం లో జనసేన జోష్.. భారీ బైక్ ర్యాలీ, చేరికలు
X

దిశ, కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సమావేశంలో జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సమక్షంలో సుమారు 200 మంది యువకులు, మహిళలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రజాసేవ కోసమే జనసేనలో చేరానని, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో పనిచేస్తానని తెలిపారు. రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. తెలంగాణలో సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యమని, అవకాశం వస్తే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు తనీష్, హసీనా, జయశ్రీతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

Next Story