ఏపీలో మరో భారీ నిధి.. అత్యంత విలువైన 24 రకాల ఖనిజాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-12 12:09:22  IST  )

ఏపీలో మరో ఖనిజ నిధి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వెలికితీసేందుకు ఏర్పాట్లు జరుగుతోంది. ఈ ఖనిజ నిధి కూడా రాయలసీమలోనే ఉండటం విశేషం....

ఏపీలో మరో భారీ నిధి.. అత్యంత విలువైన  24 రకాల ఖనిజాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో ఖనిజ నిధి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వెలికితీసేందుకు ఏర్పాట్లు జరుగుతోంది. ఈ ఖనిజ నిధి కూడా రాయలసీమలోనే ఉండటం విశేషం. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో భూగర్భంలో దాగి ఉన్నట్లు బంగారాన్ని వెలికిస్తున్నారు. ఇప్పుడు ఇదే సీమలో మరోచోట కూడా ఖనిజ వనరు ఉండటంతో వెలికితేసేందుకు కేంద్రం ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది.

పీలేరు నియోజకవర్గం ఒంటెల్లులో ఏకంగా..

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం ఒంటెల్లులోని చంద్రగిరి బ్లాక్‌లో ఏకంగా 250 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రగనుల శాఖ నిర్ధారించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఈ భారీ ఆన్వేషణ లెసెన్స్ దక్కించుకుంది. రక్షణ రంగం ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగపడే 24 రకాల అత్యంత విలువైన ఖనిజాలు ఇక్కడ ఉన్నట్లు అటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. దీంతో ఈ భూగర్జ ఖనిజాలను వెలికితీసేందుకు వేట ప్రారంభించనుంది.

ఏడాదిలోపు మైనింగ్ ఒప్పందాలు పూర్తి చేసుకుని...

రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందిన వెంటనే ఏడాదిలోపు మైనింగ్ ఒప్పందాలు పూర్తి చేసుకుని క్షేత్ర స్థాయిలో సర్వే పనులను వేగవంతం చేసేందుకు కోల్ ఇండియా సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఖనిజాన్వేషణ మొత్తం మూడు దశల్లో చేపట్టనున్నారు. G3, G4 స్థాయిలో జియోలాజికల్ మ్యాపింగ్ భూగర్భ సర్వేలు నిర్వహిస్తారు. ఈ 250 చదరపు కిలో మీటర్ల పరిధిలో పలు చోట్ల అటవీ ప్రాంతాలు, కొండలు ఉండటంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి స్టేజ్ వన్ పారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటున్నారు. సర్వే ప్రారంభించే ముందు అన్నమయ్య, తిరుపతి కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకుంటారు. వీటితో పాటురెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో సరిహద్దులను గుర్తిస్తారు. అన్ని అనుమతుల తర్వాత ఖనిజాలు వెలికితీయనున్నారు.

Next Story